Glenn McGrath | ఏదో ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితేనే.. బుమ్రా కెరీర్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
Glenn McGrath : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah,) ఐర్లాండ్ పర్యటన(Ireland Tour)తో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బుమ్రా కెరీర్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్( Glenn McGrath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడం మంచిదని...
Glenn McGrath : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah,) ఐర్లాండ్ పర్యటన(Ireland Tour)తో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అతడిపైనే ఇప్పుడు అందరి కళ్లు నిలిచాయి. అయితే.. బుమ్రా కెరీర్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్( Glenn McGrath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడం మంచిదని మెక్‌గ్రాత్ సూచించాడు. బుమ్రా బౌలింగ్‌కు అతి పెద్ద ఫ్యాన్ అని పేర్కొన్న మెక్‌గ్రాత్.. అతడి బౌలింగ్ శైలి(Bowling Action) భిన్నంగా ఉండటంతోనే శరీరంపై అధిక భారం పడుతోందని అన్నాడు.
‘నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడు భారత జట్టు తరఫున మంచి ప్రదర్శనలు చేశాడు. అయితే.. రన్నప్ భిన్నంగా ఉండటంతోనే ఈ యార్కర్ కింగ్ శరీరంపై భారం ఎక్కువగా పడుతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే అతడు మరింత బలంగా తయారవ్వడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం క్రికెటర్లు విశ్రాంతి లేని క్రికెట్ ఆడుతున్నారు. అలాంటప్పుడు గాయాలపాలవ్వడం సర్వ సాధారణం. ఈ విషయాన్ని బుమ్రా దృష్టిలో పెట్టుకోవాలి. టీమిండియాకు ఎక్కువ కాలం అందుబాటులో ఉండాలంటే అతను ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయం’ అని మెక్‌గ్రాత్ వివరించాడు.
జస్ప్రీత్ బుమ్రా

ప్రధాన టోర్నీల కోసం..
నిరుడు వెన్నెముకకు శస్త్రచికిత్స(Back Surgery) చేయించుకున్న బుమ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఏడాది ఆసియా కప్(Asia Cup 2023), వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) వంటి ప్రధాన టోర్నీల కోసం ఈ పేస్ గుర్రం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఐర్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో బుమ్రా రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. మూడు టీ20ల సిరీస్‌కు అతనే కెప్టెన్ కావడం విశేషం. అయితే.. ఈ సారైనా చాన్నాళ్లు అతడి సేవలు కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పక తప్పదని మెక్‌గ్రాత్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

