Ashleigh Gardner : మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను ఏడోసారి గెలుపొందిన ఆస్ట్రేలియా (Australia) జట్టు మళ్లీ వార్తల్లో నిలిచింది. విశ్వ విజేతగా గాల్లో తేలిపోతున్న ఆసీస్ ఆల్‌రౌండర్ అష్లే గార్డనర్ (Ashleigh Gardner) ఇంటి సమస్యనే ఇందుకు కారణం. నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో గార్డ్నర్ తనను చీట్ చేసిందని, మరో క్రికెటర్‌తో సన్నిహితంగా మెలిగిందని మోనికా రైట్ (Monica Wright) సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టులో సీనియరైన అష్లే గార్డ్నర్ వివాదంలో ఇరుక్కుంది. మరో మహిళను పెళ్లి చేసుకున్న ఈ ఆల్‌రౌండర్ ఇప్పుడు మరొకరితో ప్రేమాయాణం సాగిస్తుందనే వార్త వైరలవుతోంది. గార్డ్నర్పై ఈ ఆరోపణలు చేసింది ఆమె భార్య మోనికా రైట్ కావడం గమనార్హం.
Ashleigh Gardner’s Ex-wife on Instagram Story alleged her of cheating with her Fellow Aussie Female cricketer 💀 pic.twitter.com/zi20HtE36L
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 13, 2026
మోనికా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న ఈ అఫైర్ విషయం డెయిలీ మెయిల్(Daily Mail) వార్థ సంస్థలో ప్రచురితమైంది. గార్డ్నర్ అఫైర్‌పై భగ్గుమన్న మోనికా.. ఆస్ట్రేలియా క్రికెటర్ జార్జియా వోల్(Georgia Voll) ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈవిడే మా కాపురాన్ని నాశనం చేసింది’ అని వెల్లడించింది. అన్యోన్యంగా ఉండే తమ మధ్య దూరం పెరగడానికి కారణం భారత పర్యటనే అంటోంది మోనికా.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ కోసం గార్డన్ర్తో పాటు ఆమె భార్య మోనికా కూడా వచ్చింది. అయితే.. టోర్నీ సమయంలోనే గార్డ్నర్ ప్రవర్తనలో తేడాను గమనించింది మోనిక. స్వదేశం వచ్చాక ఇదే విషయంపై తన భాగస్వామిని ఆమె ప్రశ్నించింది. అప్పుడు.. గార్డ్నర్ మన మధ్యలో ఏదో మార్పు వచ్చింది. ఇక కలిసి ఉండడం కుదరదు అని తేల్చి చెప్పింది. అక్కడితో వీరి పెళ్లి పెటాకులైంది.
🚨 REPORT: ASHLEIGH GARDNER FACES CHEATING ALLEGATIONS
Wright (her wife) shared a post on social media alleging Gardner had an affair with Australian teammate Georgia Voll, while reports from the Daily Mail claim the couple separated after the 2025 Women’s World Cup.… pic.twitter.com/d5dzqUdChv
— TheWicketReport (@WicketReport) July 13, 2026
నిరుడు నవంబర్లోనే ఆసీస్ ఆల్‌రౌండర్ సిడ్నీలో తాము కలిసి ఉంటున్న ఇంటిని వీడింది. వెళ్తూ వెళ్తే తమ పెళ్లి ఉంగరాలను అక్కడే వదిలేసిందని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన గార్డ్నర్, మోనికలు 2025 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది పూర్తికాగానే వీరి మధ్య మనస్పర్థలు.. పరాయి ఆకర్షణలు పెరగడంతో వీరి బంధం ముగిసింది.