Australia Open 2024: స్వియాటెక్‌కు షాక్.. వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్‌కు అచ్చిరాని ఆస్ట్రేలియా ఓపెన్
Australia Open 2024: నాలుగేండ్లుగా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న ఆమె.. 2022 సీజన్లో మాత్రమే సెమీస్‌కు చేరుకోగలిగింది. గతేడాది కూడా ఆమె నాలుగో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. తాజాగా ప్రిక్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
Australia Open 2024: లేడీ నాదల్గా గుర్తింపు దక్కించుకున్న పోలండ్ బామ, మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్‌గా ఉన్న ఇగా స్వియాటెక్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటివరకూ ఈ టోర్నీ గెలవని ఈ పోలండ్ సంచలనం.. మరోసారి ఉత్తచేతులతోనే వెనుదిరిగింది. మూడో రౌండ్లో ఇగా స్వియాటెక్.. 6-3, 3-6, 4-6 తేడాతో లిండా నోస్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో 2024లో అయినా ఆస్ట్రేలియా ఓపెన్ గెలవాలన్న పట్టుదలతో మెల్బోర్న్కు వచ్చిన స్వియాటెక్ కలలు కల్లలయ్యాయి.
తన కెరీర్లో నాలుగు గ్రాండ్ స్లామ్స్ గెలిచిన స్వియాటెక్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇప్పటిదాకా సెమీస్ కూడా దాటిన రికార్డు లేదు. నాలుగేండ్లుగా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న ఆమె.. 2022 సీజన్లో మాత్రమే సెమీస్‌కు చేరుకోగలిగింది. గతేడాది కూడా ఆమె నాలుగో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. తాజాగా ప్రిక్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇప్పటివరకూ ఆమె నాలుగు గ్రాండ్ స్లామ్స్ గెలవగా అందులో మూడు ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022, 2023) లోనివే. 2022లో ఆమె యూఎస్ ఓపెన్ నెగ్గింది.
The biggest win of her career 👏
A night to remember for Linda Noskova! ✨#AusOpen • #AO2024 • @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/ptb9gFkKUW
— #AusOpen (@AustralianOpen) January 20, 2024
ఇక తాజా టోర్నీ విషయానికొస్తే.. స్వియాటెక్ తొలి రౌండ్లో 2020 ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్ సోఫియా కెనిన్‌ను ఓడించింది. రెండో రౌండ్లో 2022 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనలిస్టు డానియల్లె కొలిన్స్‌తో అతికష్టమ్మీద గెలిచింది. కానీ మూడో రౌండ్లో మాత్రం వయసులో తనకంటే చిన్నదైన చెక్ అమ్మాయి చేతిలో పరాభవం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్ గెలిచిన ఇగా.. తర్వాత తడబడింది. అనవసర తప్పిదాలతో రెండో సెట్ కోల్పోయిన ఇగా.. మూడో సెట్లోనూ ఓడి ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇప్పటిదాకా 23 మ్యాచ్‌లు ఆడిన స్వియాటెక్.. 17 గెలిచి ఆరు ఓడింది.
“𝙎𝒉𝙚 𝙬𝒂𝙨 𝙛𝒆𝙖𝒓𝙡𝒆𝙨𝒔”
Linda Noskova knocks out world No.1 Iga Swiatek 3-6 6-3 6-4 😱🤯#AusOpen pic.twitter.com/R7kX4EdVH8
— Eurosport (@eurosport) January 20, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

