Avani Lekhara | అవనీ లేఖారాకు ఆనంద్ మహీంద్రా ‘స్పెషల్ ఎస్యూవీ’ గిఫ్ట్
Avani Lekhara | టోక్యో పారాలంపిక్స్ ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (ఎస్‌హెచ్1) విభాగంలో అవనీ లేఖారా రికార్డు నెలకొల్పారు. పారాలంపిక్స్ ....

Avani Lekhara | టోక్యో పారాలంపిక్స్ ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (ఎస్‌హెచ్1) విభాగంలో అవనీ లేఖారా రికార్డు నెలకొల్పారు. పారాలంపిక్స్ చరిత్రలోనే తొలిసారి స్వర్ణ పతకం సాధించారు. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందించారు. అంతే కాదు. ఆమెకు స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు.
వికలాంగుల కోసం తయారు చేసిన తొలి కస్టమైజ్డ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ని ఆమెకు మహీంద్రా అండ్ మహీంద్రా అందజేస్తుందని తెలిపారు. పారాలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపా మల్లిక్ చేతుల మీదుగా ఈ స్పెషల్ ఎస్‌యూవీని అవనీ లేఖారాకు అందిస్తుందన్నారు. వికలాంగులు రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా స్పెషల్ ఎస్‌యూవీని తయారు చేస్తామని ట్వీట్ చేశారు.
టోక్యో పారాలంపిక్స్‌లో అవనీ లేఖారా వాడిన ఎస్యూవీ మాదిరిగానే ఎస్యూవీ కారును డెవలప్ చేయాలని తమకు వారం క్రితం దీపా మల్లిక్ సూచించారన్నారు ఆనంద్ మహీంద్రా. ఈ మేరకు వికలాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఎస్‌యూవీని తయారు చేయాలని తమ సంస్థ డెవలప్మెంట్ హెడ్ వేలును కోరానన్నారు. తొలి వాహనాన్ని అవనీ లేఖారాకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు.
ఆనంద్ మహీంద్రా నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అథ్లెట్లకు రివార్డులు ఇచ్చి ప్రోత్సహించేందుకు మిగతా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సోషల్‌మీడియాలో పలువురు కోరుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

