మియామి గార్డెన్స్ (యూఎస్ఏ) : పురుషుల టెన్నిస్ నంబర్ వన్ ర్యాంకు ప్లేయర్ కార్లొస్ అల్కరాజ్కు మరో షాక్. ఇటీవలే ముగిసిన ఇండియన్ వెల్స్ సెమీస్ పోరులో డానిల్ మెద్వెదెవ్ చేతిలో ఓడిన ఈ స్పెయిన్ కుర్రాడు తాజాగా మియామి ఓపెన్‌లో మూడో రౌండ్‌కే ఇంటిబాట పట్టాడు. మెన్స్ సింగిల్స్ థర్డ్ రౌండ్లో అల్కరాజ్.. 3-6, 7-5, 4-6తో సెబాస్టియన్ కొర్డా (యూఎస్ఏ) చేతిలో ఓటమిపాలయ్యాడు.
ప్రపంచ 32వ ర్యాంకర్ అయిన కొర్డా.. 2 గంటల 19 నిమిషాల పాటు సాగిన పోరులో రెండో సెట్‌ను పోరాడి ఓడినా నిర్ణయాత్మక మూడో సెట్లో పుంజుకుని అల్కరాజ్కు షాకిచ్చాడు. తద్వారా నిరుడు ఇదే మియామి ఓపెన్‌లో ప్రపంచ 55వ ర్యాంకర్ డేవిడ్ గాఫిన్ తర్వాత అల్కరాజ్ను ఓడించిన లోయెస్ట్ ర్యాంక్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.