Wimbledon 2023 | వింబుల్డన్: పురుషుల సింగిల్స్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి అగ్రస్థానంలో ఉన్న సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. 24వ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ సెమీఫైనల్లో శుక్రవారం రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 6-4, 7-6 (7/4)తో ఎనిమిదో సీడ్ సిన్నెర్పై విజయం సాధించాడు. టోర్నీ ఆరంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న జొకో.. సెమీస్‌లోనూ మాస్టర్ క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
జొకోకు గ్రాస్‌కోర్టులో ఇది వరుసగా 34వ విజయం కావడం విశేషం. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో జొకో ఆరు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు. 11 ఏస్‌లు సంధించిన జొకో.. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. మరోవైపు 8 ఏస్‌లకే పరిమితమైన సిన్నెర్ 3 డబుల్ పాల్ట్స్ చేసి 44 విన్నర్లు కొట్టాడు. అయితే 35 అనవసర తప్పిదాలు చేసిన సిన్నెర్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-3, 6-3, 6-3తో మూడో సీడ్ మెద్వెదెవ్పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. తుదిపోరులో అల్కరాజ్తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. శనివారం మహిళల ఫైనల్లో వొండ్రుసోవాతో జాబర్ తలపడుతుంది.