అబుధాబి: న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కష్టాల్లో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్థాన్ జట్టును యువ బ్యాట్స్‌మెన్ నజిబుల్లా జద్రాన్ ఆదుకున్నాడు. న్యూజిల్యాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొంటూ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
ఆఫ్ఘన్ జట్టులో జద్రాన్ కాకుండా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. షెహజాద్ (4), జజాయ్ (2), రహ్మనుల్లా (6) గుల్బాదిన్ (15) ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్ఉ క్యూకట్టారు. ప్రస్తుతం జద్రాన్తోపాటు కెప్టెన్ నబీ (10 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ 91/4 స్కోరు చేసింది.