అబుధాబి: కీలకమైన మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఓపెనర్లిద్దరూ తక్కువ స్కోర్లకే వెనుతిరిగి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడనుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ (6) కూడా పెవిలియన్ చేరాడు.
వెటరన్ పేసర్ సౌథీ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించిన రహ్మనుల్లా ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.