అబుధాబి: కివీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గనిస్థాన్ బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఓపెనర్లు షెహజాద్ (4), జజాయ్ (2) స్వల్పస్కోర్లకే అవుటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే రహ్మనుల్లా గుర్బాజ్ (6)ను సౌథీ అవుట్ చేశాడు. దీంతో 19/3తో కష్టాల్లో పడిన జట్టును గుల్బాదిన్ నైబ్ (15), నజిబుల్లా జద్రాన్ (27 నాటౌట్) ఆదుకున్నారు.
కానీ పదో ఓవర్ చివరి బంతికి గుల్బాదిన్ అవుటయ్యాడు. ఇష్ సోధి వేసిన బంతి గుల్బాదిన్ బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తగిలింది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ 56/4 స్కోరుతో నిలిచింది.