అబుధాబి: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే ఆఫ్ఘన్‌కు తొలి షాకిచ్చాడు. స్టార్ ప్లేయర్ షెహజాద్ (4)ను అవుట్ చేశాడు. షార్ట్ పిచ్ బంతిని తనదైన స్టైల్లో ఆడేందుకు షెహజాద్ ప్రయత్నించగా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ కాన్వే వైపు వెళ్లింది. ఒక్క చేత్తో దాన్ని అందుకోవడానికి ప్రయత్నించిన అతను తడబడ్డాడు.
కానీ చివరకు అందుకున్నాడు. దీంతో నాలుగు పరుగులకే షెహజాద్ పెవిలియన్ బాటపట్టాడు. ఆ వెంటనే నాలుగో ఓవర్ తొలి బంతికే ప్రమాదకరమైన జజాయ్‌ను బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. అతను కూడా షార్ట్‌పిచ్ బంతికే శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 12/2 స్కోరుతో కష్టాల్లో పడింది.