SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) వేగవంతమైన అర్ధ శతకంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడగా.. మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్(59) ఉతికేశాడు. వీరిద్దరి మెరుపులతో రెండొందలకు పైగా కొట్టేలా కనిపించిన సన్‌రైజర్స్‌ను సీఎస్కే గొప్పగా కట్టడి చేసింది. అన్షుల్ కంభోజ్(3-22), జేమీ ఓవర్టన్ (3-37) డెత్ ఓవర్లలో వికెట్ల వేటతో హైదరాబాద్‌ను 194కే పరిమితం చేసింది చెన్నై.
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో దంచినా.. ఆఖర్లో తడబడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) సునామీ ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అన్షుల్ కంభోజ్(3-22), షార్ట్ ఓవర్లో సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు 15 బంతుల్లోనే అర్ధ శతకంత ఓభారీ స్కోర్‌కు బాటలు వేశాడు. కానీ, ముకేశ్ చౌదరీ(2-21) ఒకే ఓవర్లో ట్రావిస్ హెడ్(23), ఇషాన్ కిషన్(0)ను ఔట్ చేయగా 75 వద్ద రెండు వికెట్లు పడ్డాయి.
𝗨𝗡𝗦𝗧𝗢𝗣𝗣𝗔𝗕𝗟𝗘 🔥
Abhishek Sharma was at his brutal best against Matthew Short 👊
Relive ▶️ https://t.co/nV9SVInzhd#TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/Ir4gz2qQhe
— IndianPremierLeague (@IPL) April 18, 2026
అనంతరం హెన్రిచ్ క్లాసెన్(59) జతగా అభిషేక్ జోరు పెంచానలుకున్నాడు. అయితే.. కానీ, ఓవర్టన్ ఓవర్లో అతడు వికెట్ కీపర్ సంజూకు దొరికిపోయాడు. దాంతో, 93కు మూడో వికెట్ పడింది. ఆ తర్వాత క్లాసెన్ చెలరేగినా అనికేత్ వర్మ(2), నితీశ్ రెడ్డి(12), సలీల్ అరోరా(13)లు లా వచ్చి అలా వెళ్లారు. ఇంప్యాక్ట్ సబ్ లివింగ్‌స్టోన్ (1) పెద్ద షాట్లు ఆడకున్నా.. శివాంగ్ కుమార్(12) బ్యాట్ ఝులింపించడంతో హైదరాబాద్ జట్టు ప్రత్యర్ధికి 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
A dependable 5⃣9⃣(39) 🔥
Heinrich Klaasen with yet another crucial knock 🧡
Did you have him in your Fantasy XI? 🤔
Updates ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers pic.twitter.com/rj1cLCV97R
— IndianPremierLeague (@IPL) April 18, 2026