స్మార్ట్ఫోన్లలో ఇప్పుడు eSIM టెక్నాలజీ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఐఫోన్లతో పాటు ప్రీమియం ఆండ్రాయిడ్ మొబైళ్లలోనే ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు మీడియం రేంజ్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలామంది ఈసిమ్ వాడటంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈసిమ్ వాడితే ఇంటర్నెట్ వేగంగా పెరుగుతుందా? సంప్రదాయ ఫిజికల్ సిమ్ కంటే మెరుగ్గా పనిచేస్తుందా? అని చాలామంది ఆలోచిస్తున్నారు. మరి ఈసిమ్ వల్ల ప్రయోజనాలంటో ఇప్పుడు తెలుసుకుందాం..
eSIM అంటే ఎంబేడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది సాధారణ సిమ్ కార్డు తరహాలో తీసి పెట్టుకునేది కాదు. మొబైల్ ఫోన్ తయారీ సమయంలోనే ఫోన్ మదర్ బోర్డులో అమర్చిన డిజిటల్ సిమ్. కాబట్టి ప్రత్యేకంగా సిమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. టెలికాం సంస్థల నుంచి అందే డిజిటల్ ప్రొఫైల్‌ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నెట్వర్క్ సేవలను వినియోగించుకోవచ్చు.
ఈసిమ్ వాడుతున్నంత మాత్రాన ఇంటర్నెట్ వేగం పెరగదు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది ప్రధానంగా నెట్వర్క్ కవరేజ్, టెలికాం ఆపరేటర్ సేవలు, 4జీ లేదా 5జీ అందుబాటు, అలాగే ఒక ప్రాంతంలో ఉన్న నెట్వర్క్ ట్రాఫిక్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకే టెలికాం కంపెనీకి చెందిన ఈసిమ్, ఫిజికల్ సిమ్‌లను పరిశీలిస్తే రెండింటిలోనూ దాదాపు ఒకే స్థాయి వేగం లభిస్తుంది.
ఇంటర్నెట్ స్పీడ్‌లో మార్పులేనప్పటికీ.. ఈసిమ్ ద్వారా వినియోగదారులకు అనేక సౌకర్యాలు లభిస్తున్నాయి. అవేంటంటే..
ఈసిమ్ అనేది టెక్నాలజీపరంగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ.. చాలామందికి ఫిజికల్ సిమ్‌నే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే..
మీ ఫోన్లో ఈసిమ్ సపోర్టు ఉండి, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమై కనెక్టివిటీ కావాలని అనుకుంటే ఈసిమ్ తీసుకోవడం బెటర్ అయితే తరచూ ఫోన్లు మార్చేవారు లేదా సిమ్‌ను ఇతర డివైజ్‌ల్లో ఉపయోగించే అవసరం ఉన్న వారు ఫిజికల సిమ ఎంచుకోవడం మంచిది.