Realme C31 | రియల్మీ నుంచి సీ31 మోడల్ ఫోన్ తాజాగా లాంచ్ అయింది. సీ సిరీస్‌లో భాగంగా రియల్మీ నుంచి బడ్జెట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేశారు. 6.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 13 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, యూనిసెక్ టీ612 చిప్సెట్, ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ ఆర్ యూఐ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది.
3 జీబీ ప్లస్ 32 జీబీ వేరియంట్ రియల్మీ సీ31 ఫోన్ ధర రూ.8999గా నిర్ణయించారు. 4 జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ.9999గా ఉంది. డార్క్ గ్రీన్, లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 6, మధ్యాహ్నం 12 నుంచి ఈ ఫోన్‌ను రియల్మీ కంపెనీ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ చానెల్స్‌లో కొనుగోలు చేయొచ్చు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ, వైఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎన్ఎమ్ యూనిసాక్ టీ612 ప్రాసెసర్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.