OnePlus | ఆగస్ట్ 3న వన్‌ప్లస్ 10టీ లాంఛ్..అమెజాన్‌లో లిస్టయిన హాట్ డివైజ్!
ఆగస్ట్ 3న వన్‌ప్లస్ 10టీ భారత్‌లో లాంచ్ కానుండగా అమెజాన్‌లో లిస్టయిన ఈ హాట్ డివైజ్ ప్రీఆర్డర్లు కూడా అదే రోజున షురూ అవుతాయి.
న్యూఢిల్లీ : ఆగస్ట్ 3న వన్‌ప్లస్ 10టీ భారత్‌లో లాంచ్ కానుండగా అమెజాన్‌లో లిస్టయిన ఈ హాట్ డివైజ్ ప్రీఆర్డర్లు కూడా అదే రోజున షురూ అవుతాయి. వన్‌ప్లస్ 10టీ ప్రీ ఆర్డర్లపై కొన్ని బ్యాంక్ కార్డు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. లాంఛ్ తర్వాత అదే వారంలో వన్‌ప్లస్ 10టీ సేల్స్ ప్రారంభమవుతాయి. భారత్‌లో వన్‌ప్లస్ 10టీ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ 49,999గా ఉంటుందని సమాచారం.
లేటెస్ట్ వన్‌ప్లస్ ఫోన్ మూన్‌స్టోన్ బ్లాక్, జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 512జీబీ ఆప్షన్లో అందుబాటులో ఉండే తొలి వన్‌ప్లస్ ఫోన్‌గా చెబుతున్నారు. ఆగస్ట్ 3న లాంఛ్ సందర్భంగా లేటెస్ట్ పోన్ ధర, సేల్ వివరాలను వన్‌ప్లస్ అధికారికంగా వెల్లడించనుంది. వన్‌ప్లస్ 10టీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ స్మార్ట్‌పోన్ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఇక 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా కలిగిఉంది. వన్‌ప్లస్ 10టీ 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. వన్‌ప్లస్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ స్టీరియో స్పీకర్లను ఆఫర్ చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

