Nothing Phone (1) | యూనిక్ డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 ఎంట్రీ : రూ 30,000కు అందుబాటులో ట్రెండీ ఫోన్!
స్మార్ట్ఫోన్లలో ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందనే అంచనాలతో నథింగ్ ఫోన్ 1 జులై 12లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లలో ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందనే అంచనాలతో నథింగ్ ఫోన్ 1 జులై 12లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మూస ధోరణిని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో నథింగ్ ఫోన్ 1 వ్యవస్ధాపకుడు కార్ల్ పీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ట్రెండీ ఫోన్ ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో ఆకట్టుకోనుంది. డివైజ్ లోపల ఎల్ఈడీ లైట్లను అమర్చడం వంటి పలు ఫీచర్లతో కూడిన ఫోన్ డిజైన్ మొత్తం తాజా టీజర్లలో వెల్లడైంది.
రానున్న నథింగ్ ఫోన్ 1 ఐఫోన్లతో పోటీ పడుతుందని చెబుతున్నారు. భారత్‌లో నథింగ్ పోన్ 1 రూ. 30,000కు అందుబాటులో ఉంటుందని అంచనా. ఇదే ధరలో లభిస్తే నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌పోన్ మార్కెట్లో నూతన బెంచ్‌మార్క్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐఫోన్లతో పాటు రూ 28,999 ప్రారంభ ధరకు లభించే వన్‌ప్లస్ నార్డ్ 2టీ వంటి ఫోన్లకు నథింగ్ పోన్ 1 దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఇక నథింగ్ ఫోన్ 1 ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యాం, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉండనుంది. 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో నథింగ్ ఫోన్ 1 ముందుకు రానుందని కంపెనీ నిర్ధారించింది. అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఫీచర్ ఉంటుందని కూడా కంపెనీ టీజర్లో తెలిపింది. వెనుక భాగంలో రెండు కెమెరా సెన్సర్లు ఉంటాయని, ముందుభాగంలో హోల్ పంచ్ డిజైన్‌ను జోడించామని వెల్లడించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

