Nothing Phone (1) | క్రేజీ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 1 గ్రాండ్ ఎంట్రీ..హైలైట్స్ ఏంటంటే.!
ట్రెండీ స్మార్ట్‌ఫోన్‌గా ఊరించిన నథింగ్ ఫోన్ 1 భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో మంగళవారం రాత్రి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. క్రేజీ ఫీచర్లు, హాట్ స్పెసిఫికేషన్స్‌తో నెలల తరబడి నిరీక్షణకు తెరదించుతూ లాంఛ్ అయింది.
న్యూఢిల్లీ : ట్రెండీ స్మార్ట్‌ఫోన్‌గా ఊరించిన నథింగ్ ఫోన్ 1 భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో మంగళవారం రాత్రి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. క్రేజీ ఫీచర్లు, హాట్ స్పెసిఫికేషన్స్‌తో నెలల తరబడి నిరీక్షణకు తెరదించుతూ లాంఛ్ అయింది. యూనిక్ డివైజ్‌గా పేరొందిన నథింగ్ ఫోన్ 1 కోసం నెలల పాటు సాగించిన నిరీక్షణకు తెరపడింది. విభిన్నమైన డిజైన్‌తో ఈ డివైజ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నెలకొల్పిన నథింగ్ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్‌గా నథింగ్ ఫోన్ 1 మొబైల్ మార్కెట్లో పెను సంచలనాలకు నాంది పలికేలా అడుగుపెట్టింది. లాంచ్ ఈవెంట్లో నథింగ్ ఫోన్ 1 వివరాలను కార్ల్ వెల్లడించారు. ఫోన్ హైలైట్స్ .. ఫుల్ హెచ్‌డీప్లస్, ఓఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 1 కస్టమర్ల ముందుకు వచ్చింది.
వైర్డ్, వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ట్రాన్స్ప్రరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్ ఇంటర్ఫేస్తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటుంది. నోటిఫికేషన్లు, బ్యాటరీ ఇండికేటర్, కాల్స్ అలర్ట్‌లకు ప్రత్యేకమైన లైటింగ్ ప్యాటర్న్ మరో క్రేజీ ఫీచర్‌గా నిలవనుంది. మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఫోన్ 1 ధరలిలా ఉన్నాయి.
8జీబీ ర్యాం + 128 జీబీ స్టోరేజ్ ధర – రూ.32,999
8జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్ ధర – రూ.35,999
12జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్ ధర – రూ.38,999
ఇక ఈ డివైజ్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్స్ షురూ అయ్యాయి. కాగా, ఈనెల 21వ తేదీ రాత్రి 7 గంటలకు నథింగ్ ఫోన్ 1 సాధారణ సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ లభిస్తుండగా ఆఫ్‌లైన్‌లో నథింగ్ పోన్ 1 కొనుగోలు కోసం కస్టమర్లు మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

