Moto G13 | లెనోవో అనుబంధ సంస్థ మోటరోలా భారత్ మార్కెట్లోకి మోటో-జీ13 5జీ ఫోన్ ఈ నెల 29న ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న మోటో-జీ13 ఫోన్ కేవలం ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనుగోలు చేయొచ్చు. మ్యాట్ చార్కోల్, లావెండర్ బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యం అవుతుంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల నుంచి రూ.11 వేల మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు.