న్యూఢిల్లీ : నథింగ్ ఫోన్ 1 భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జులై 12న లాంఛ్ కానుంది. నథింగ్ ఫోన్ 1 ఇతర స్మార్ట్ఫోన్ల తరహాలో కాకుండా సంథింగ్ స్పెషల్‌గా ఉండనుంది. తాజాగా ఈ యూనిక్ మొబైల్ డిజైన్‌ను వివరిస్తూ ఓ యూట్యూబ్ వీడియో వెలుగులోకి రావడంతో ఈ స్మార్ట్‌పోన్ ట్రెండీ లుక్, హాట్ పీచర్లు వెల్లడయ్యాయి. ఇతర స్మార్ట్ఫోన్లకు భిన్నంగా దీని బ్యాక్ ప్యానెల్ డిజైన్ వైవిధ్యంగా ఉంది. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 కోసం ప్రపంచమంతా వేచిచూస్తున్న క్రమంలో వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ బ్రైన్ చైల్డ్‌గా ఎదిగిన నథింగ్ నుంచి రానున్న ఈ ఫోన్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయనుంది.
ప్రముఖ యూట్యూబర్ విడుదల చేసిన వీడియో ద్వారా నథింగ్ ఫోన్ 1 డిజైన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికి వచ్చాయి. నథింగ్ 1 బ్యాక్ ప్యానెల్ పూర్తిగా భిన్నంగా ఉంటూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మిగిలిన స్మార్ట్ఫోన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉండేలా, కొత్త ట్రెండ్ సృష్టించేలా దీన్ని నథింగ్ తయారు చేసింది. నథింగ్ ఫోన్ 1 బ్యాక్ ప్యానెల్‌కు లైట్ సెటప్ ఉంది. దీనిలో ఉండే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనే ఫీచర్ మొబైల్ వెనుక ఉన్న లైట్ సెటప్‌ను కంట్రోల్ చేసేందుకు ఉపయోపడుతుంది. భిన్నమైన రింగ్ టోన్స్ వచ్చే సమయంలో వినూత్నంగా లైట్స్ బ్లింక్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.
ఫోన్ సౌండ్‌ను బట్టి లైట్స్ వెలిగేలా సెట్ చేసుకునే ఫీచర్ కూడా యూజర్లను ఆకట్టుకుంటుంది. ఇక నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా అలెర్ట్ చేసేలా ఈ లైట్స్ ఉపకరిస్తాయి. ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో కూడా ఈ లైట్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం సెట్టింగ్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. మొబైల్ చార్జింగ్ స్టేటస్ ఇండికేటర్గానూ నథింగ్ ఫోన్ 1 వెనుక ఉన్న లైట్స్ పని చేస్తాయి. చార్జింగ్ పెట్టగానే లైట్ సెటప్‌లో సన్నని గీత వెలుగుతుంది. ఇది బ్యాటరీ లెవెల్‌ను తెలుపుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం చూడని విధంగా నథింగ్ 1 బాక్సీ డిజైన్‌తో కస్టమర్ల ముందుకొస్తోంది. ఐఫోన్ 12 తరహాలో నథింగ్ పోన్ 1 వర్టికల్లీ ప్లేస్డ్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టంతో రానుంది.