New study: రాత్రి పూట ఇలాచేస్తే గుండెపోటు..తాజా అధ్యయనంలో వెల్లడి
పడుకునేముందు రూంలోని ప్రతీ లైట్‌ను ఆర్పేయండి. కిటికీ కర్టెన్లు మూసేయండి. రూంలో చిన్న లైట్కూడా వెలుగొద్దు. రూమంతా గాడాంధకారంగా మారిపోవాలి. బెడ్రూంలో రాత్రిపూట చిన్న లైట్ వెలిగినా మీరు అనారోగ్యంపాలైనట్లే అంటున్నారు పరిశోధకులు. మసక వెలుతురు కూడా నిద్రలో హృదయనాళ పనితీరును దెబ్బతీస్తుంది.
పడుకునేముందు రూంలోని ప్రతీ లైట్‌ను ఆర్పేయండి. కిటికీ కర్టెన్లు మూసేయండి. రూంలో చిన్న లైట్కూడా వెలుగొద్దు. రూమంతా గాడాంధకారంగా మారిపోవాలి. బెడ్రూంలో రాత్రిపూట చిన్న లైట్ వెలిగినా మీరు అనారోగ్యంపాలైనట్లే అంటున్నారు పరిశోధకులు. మసక వెలుతురు కూడా నిద్రలో హృదయనాళ పనితీరును దెబ్బతీస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇన్సులిన్ నిరోధకత (insulin resistance)ను పెంచుతుంది. దీంతో గుండెపోటు, మధుమేహం బారినపడే ప్రమాదం ఉంది.
ఈ విషయాలు యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో పరిశోధకుల అధ్యయనంలో తేలాయి. పరిశోధకులు కొంతమందిని రెండువర్గాలుగా విభజించారు. ఒక వర్గంవారు ఒకరాత్రి 3 లక్స్ (మసక కాంతి) కాంతిలో, మరో వర్గంవారు 100 లక్స్ (మితమైన కాంతి)కాంతిలో నిద్రించేలా చూశారు. మితమైన కాంతిలో నిద్రించినవారి హృదయస్పందన రేటు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. సాధారణంగా హృదయస్పందన రేటు రాత్రి తక్కువగా ఉండాలి. పగలు ఎక్కువగా ఉండాలి. కానీ, మితమైన కాంతిలో నిద్రించేవారి హార్ట్‌బీట్ పగలులాగే రాత్రికూడా ఉందని పరిశోధకులు తేల్చారు. మనం పడుకున్నా స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థ యాక్టివ్‌గా ఉంటోందని, ఇది మంచిదికాని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఫిల్లిస్ జీ వెల్లడించారు.
అలాగే, తేలికపాటి కాంతిలో నిద్రించినవారిలో ఉదయం లేవగానే ఇన్సులిన్ నిరోధకత సంభవిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ కండరాలు, కొవ్వు, కాలేయంలోని కణాలు ఇన్సులిన్‌కు బాగా స్పందించకపోవడమే. రక్తంలోని గ్లూకోజ్‌ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయలేకపోవడమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీంతో ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్‌లెవల్స్ పెరిగిపోతాయని ఫిల్లిస్ జీ తెలిపారు. నిద్ర, పోషకాహారం, వ్యాయామంతోపాటు రాత్రిపూట కాంతికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని స్పష్టంచేశారు. ఈ అధ్యయన ఫలితాలు పీఎన్ఏఎస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

