Laptop Sales | లాప్‌టాప్‌లకు మాంద్యం షాక్.. 2022లో భారీగా తగ్గిన పీసీ సేల్స్.. టాప్‌లో లెనోవో!
Laptop Sales | కరోనా వేళ భారీగా డిమాండ్ గల పర్సనల్ కంప్యూటర్లు, లాప్ టాప్ లకు.. అధిక ధరలు, వడ్డీరేట్లు, ఇంధన వ్యయం వల్ల డిమాండ్ తగ్గింది. గతేడాది లాప్ టాప్ సేల్స్ 16 శాతం తగ్గాయి.
Laptop Sales | కరోనా మహమ్మారి ఉధృతి వేళ.. వర్క్ ఫ్రం హోం కల్చర్‌తో డిజిటల్ సేవల డిమాండ్ పెరిగింది. దీంతో 2020 నుంచి గతేడాది ప్రారంభం వరకు పర్సనల్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లకు ఫుల్ గిరాకీ వచ్చింది. కానీ, తర్వాత కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఇంధన వ్యయం.. అటుపై ధరలు పైపైకి దూసుకెళ్లాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వివిధ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచేయడంతో ఆర్థిక మాంద్యం ముప్పు ముందుకు తోసుకొచ్చింది. ఫలితంగా అన్ని రంగాల సంస్థలు పొదుపు మంత్రం పటిస్తున్నాయి.
2021తో పోలిస్తే 2022లో ప్రపంచవ్యాప్తంగా లాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల గిరాకీ 16 శాతం తగ్గింది. గతేడాది కేవలం 28.51 కోట్ల లాప్‌టాప్‌లు మాత్రమే అమ్ముడయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనాలియాస్ (Canalys) పేర్కొంది. కరోనాకు ముందుతో పోలిస్తే గ్లోబల్ పర్సనల్ కంప్యూటర్స్ సేల్స్ 2022లో సానుకూలంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019తో పోలిస్తే 2022లో ఏడు శాతం ఎక్కువగానే పర్సనల్ కంప్యూటర్ల సేల్స్ నమోదయ్యాయి.
ఇక డెస్క్‌టాప్ కంప్యూటర్లు, నోట్‌బుక్‌ల విక్రయాలు 2022 నాలుగో త్రైమాసికంలో 29 శాతం తగ్గి 6.54 కోట్లకు పడిపోయాయి. నోట్‌బుక్స్ సేల్స్ 30 శాతం పతనమై 5.14 కోట్లకు పరిమితం అయ్యాయి. అంతర్జాతీయంగా పర్సనల్ కంప్యూటర్ల విక్రయంలో అగ్రభాగం.. లెనోవో అందుకోగా, తర్వాతీ జాబితాలో హెచ్‌పీ, డెల్, ఆపిల్, అసుస్ నిలిచాయి.
గతేడాది చివరి త్రైమాసికంలో నోట్‌బుక్స్ సేల్స్ 30 శాతం తగ్గి 5.14 కోట్లకు పరిమితమైతే.. గత ఏడాది కాలంలో 19 శాతం తగ్గి 22.38 కోట్లతో సరిపెట్టుకున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్ల విక్రయాలు 2022 నాలుగో త్రైమాసికంలో 1.41 కోట్లు (24 శాతం పతనం) నమోదైతే.. ఏడాది మొత్తంలో ఏడు శాతం తగ్గి 6.13 కోట్లకు దిగి వచ్చాయి. చివరి త్రైమాసికంతోపాటు గతేడాది సేల్స్‌లో లెనోవోదే టాప్.
29 శాతం సేల్స్ తగ్గినా 2022లో లెనోవో లాప్‌టాప్‌లు 1.55 కోట్లు అమ్ముడయ్యాయి. ఇది మొత్తం సేల్స్‌లో 23.9 శాతం. రెండో స్థానంలో ఉన్న హెచ్‌పీ 1.32 కోట్ల లాప్‌టాప్‌లు విక్రయించింది. గతేడాది మొత్తం విక్రయాల్లో 19.4 శాతం మార్కెట్ షేర్ సొంతం చేసుకున్నది. తర్వాతీ స్థానంలో ఉన్న డెల్ 1.08 కోట్లతో 17.4 శాతం వాటా, ఆపిల్ 9.5 శాతం, అసుస్ 7.2 శాతం వాటా కలిగి ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

