Dear Uma | డియర్ ఉమ రివ్యూ.. సమాజాన్ని మేల్కొపే చిత్రం
Dear Uma | తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది.
Dear Uma | తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. డియర్ ఉమ అంటూ సుమయ రెడ్డి ఆడియెన్స్ ముందుకు ఏప్రిల్ 18న వచ్చింది. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
ప్రేమలో విఫలమైన దేవ్ (పృథ్వీ అంబర్) రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశంలో గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి? అన్నది కథ.
సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన “డియర్ ఉమ” వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఒక ముఖ్యమైన చిత్రాన్ని అందించింది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా యొక్క సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, “డియర్ ఉమర్” ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.
డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి.
రేటింగ్ 3
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

