ఒకప్పుడు ఈ నేల మీద
నీళ్ళంటే కన్నీళ్ళే
ఒకప్పుడు కలలంటే
నీటి కలలే!
వెతలంటే
బతుకు భారమైన కథలే
పలుకరింపులన్నీ
కన్నీటి ప్రవాహ చారికలే!
ఇక్కడి నదీ నదాల
ప్రవాహ వేగాన్ని చూసి
పెదవులు తడుపు కోవలసిందే!
ఏ చెరువును చూసినా
గుండె కాస్తా ఎండిన చెరువయ్యేది
దశాబ్దం కూడా కాలేదు
పల్లె పట్నం తేడా లేకుండా
నిండా పరచుకున్న పచ్చదనం
మూడు కాలాలు
తొణకిసలాడుతున్న చెర్లూ కుంటలూ
నదులు పంట పొలాలను
నిత్యం పలుకరిస్తున్న దృశ్యాలు
ఎన్ని వీధులు తిరిగి చూసినా
తరగని జలపుష్ప రాశులు
వేరైతే కన్న కలలన్నీ
ఇప్పుడు దృశ్యమాన ‘జ(తె)లం’గాణ!!
కోట్ల
వెంకటేశ్వర రెడ్డి
9440233261