London | బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు లండన్ ఎన్నారైలు
London | ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గ ఆత్మీయ సమ్మేళనం ఈస్ట్ లండన్‌లో జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి సురేశ్ గోపతి ఆధ్వర్యంలో లండన్‌లో నివాసం ఉంటున్న ఉదయ్ కూరపాటి (వరంగల్), దీపక్ అప్పాని(హైదరాబాద్) సహా పలువురు ఎన్నారైలు గులాబీ కండువా కప్పుకున్నారు.
London | ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గ ఆత్మీయ సమ్మేళనం ఈస్ట్ లండన్‌లో జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి సురేశ్ గోపతి ఆధ్వర్యంలో లండన్‌లో నివాసం ఉంటున్న ఉదయ్ కూరపాటి (వరంగల్), దీపక్ అప్పాని(హైదరాబాద్) సహా పలువురు ఎన్నారైలు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఉదయ్ కూరపాటి, దీపక్ అప్పాని సహా బీఆర్ఎస్లో చేరిన పలువురు ఎన్నారైలు అన్నారు. తెలంగాణలో సంవత్సర కాలంగా జరిగిన విధ్వసం చూసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడి కేసీఆర్, కేటీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరామని చెప్పారు.

కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ రమేశ్ ఎసెంపల్లి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేశ్ కుప్పలా మాట్లాడుతూ .. ఎన్నారైలంతా కేసీఆర్ వెంట ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. మరో ఉద్యమానికి మనమంతా సిద్ధంగా ఉండి, విధ్వంసమవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ అరాచక పాలన గురించి వివరించారు. ప్రవాస సంఘాల మద్దతు కూడా బీఆర్ఎస్కు ఉండాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నారై బీఆర్ఎస్ యూకేకు అన్ని ప్రవాస తెలంగాణ సంఘాలు అండగా ఉన్నట్లుగానే.. రాబోయే రోజుల్లో సైతం అలాగే ఉంటూ అన్ని కారర్యక్రమాలను విజయవంతం చేసుకుందామని సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ రావు కటికనేని కోరారు.

ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యవర్గసభ్యులు, టీడీఎఫ్ యూకే నాయకులు కమల్ ఓరుగంటి, శ్రవణ్ ఉప్పల, శశి, నగేశ్.. జాగృతి యూకే నాయకులు సుమన్ రావు బాలమూరి, రోహిత్ రావు , రఘు, వంశీ .. హైదరాబాద్ బావర్చి రెస్టారెంట్ అధినేత కిశోర్ మునగాల , డాక్టర్ కిరీటి తదితరులు పాల్గొన్నారు.

NRI Brs London
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
Dear Astronaut | అంతరిక్షయాన కల నెరవేర్చేందుకు తండ్రి సాహసం.. ఆకట్టుకుంటున్న ‘డియర్ ఆస్ట్రోనాట్’ ట్రైలర్
Health tips | మీ డైట్లో బీట్రూట్ ఉంటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Panchayat elections | ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

