Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Job Notification | రాష్ట్రంలోని ఆర్థిక, గణాంకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ () నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. వీటిలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టులు ఉన్నాయి.
Job Notification : రాష్ట్రంలోని ఆర్థిక, గణాంకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ () నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. వీటిలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 30 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 27 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అర్హతలు, వయోపరిమితి, ఫీజుల వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. స్టాటిస్టిక్స్ను ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నది. ఇక వయోపరిమితి విషయానికొస్తే 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అదేవిధంగా 44 ఏళ్లకు మించకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు వంటి రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు
ఇక దరఖాస్తు రుసుముగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 గా ఫీజు నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన స్కేలుతోపాటు సమాజంలో కీలకపాత్ర పోషించే అవకాశం లభిస్తుంది. కమిషన్ ప్రకటించిన ప్రకారం.. ఉద్యోగంలో చేరిన వారికి నెలవారీ వేతనం స్కేల్ రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు ఉంటుంది. ప్రభుత్వ పథకాల ప్రణాళిక, అమలులో ఈ పోస్టులది కీలక పాత్ర. మండల స్థాయిలో ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సేకరించడం, వాటిని విశ్లేషించడం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించడం వంటివి వీరి ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి.
పరీక్ష తేదీ
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి నెలలో రాత పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. కచ్చితమైన తేదీని ఇంకా నిర్ణయించలేదు. పరీక్షకు వారం రోజుల ముందుగా అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 30న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఆసక్తిగల అభ్యర్థులు చివరి తేదీ అయిన నవంబర్ 27 వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ కోరింది. జోన్ల వారీగా ఖాళీలు, సిలబస్, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు సూచించారు. ఏవైనా మార్పులు ఉంటే వాటిని కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారానే వెల్లడిస్తుంది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer | 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే కొత్త రకమైన పరీక్ష.. ఏంటిది.. క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుంది..?
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

