కేటీఆర్ చెప్పినట్లు అది నిజంగానే లొట్టపీసు కేసు: గుర్రాల నాగరాజు
తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ కుట్రలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ చెప్పినట్లుగా ఆయనపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ వేధింపులేనని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ కుట్రలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ చెప్పినట్లుగా ఆయనపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ వేధింపులేనని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. అవన్నీ ఆధారాలు లేని లొట్టపీసు కేసులు మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ చట్టంపై ఉన్న గౌరవంతో విచారణకు కేటీఆర్ సమగ్రంగా విచారణకు సహకరించడం ఆయన గొప్ప నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కార్ రేసు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించారని గుర్రాల నాగరాజు అన్నారు. అవి తెలంగాణ అభివృద్ధిని గర్వంగా తెలియజేస్తున్నాయని తెలిపారు. కానీ దానిపై కాంగ్రెస్ అసత్యప్రచారాలు చేసి, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
కేటీఆర్ నిబద్ధత, నిజాయితీ, ధైర్యం మనందరికీ స్పూర్తి అని గుర్రాల నాగరాజు తెలిపారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా శాఖ తరపున, ఆయనకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రైతుల భరోసా కోసం కృషి చేయడం తమకు గౌరవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ రాజకీయాలను ఆపి, ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

