Visakha Steel Plant | ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ (Graduate & Technician Apprentice) పోస్టుల భర్తీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 2021, 2022, 2023 అకడమిక్ ఇయర్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ఉండగా.. జూలై 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 250
పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ
విభాగాలు : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి 2021, 2022, 2023 అకడమిక్ ఇయర్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : లేదు
స్టైపెండ్: నెలకు రూ.8,000 నుంచి రూ.9,000.
శిక్షణకాలం : ఒక యేడాది
ఎంపిక : అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : గూగుల్ ఫాం ద్వారా
చివరి తేదీ: జూలై 31
వెబ్సైట్ : www.vizagsteel.com