CBI Notification | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ స్కేల్-2 పోస్టులు
Central Bank of India Recruitment 2023 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Central Bank of India Recruitment 2023 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జూలై 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష (Online Written test), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతం ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1000
పోస్టులు : మేనేజర్ స్కేల్-2
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో పని అనుభవం కలిగి ఉండాలి.
కేటగిరీ వారీగా ఖాళీలు: జనరల్- 405, ఎస్సీ- 150, ఎస్టీ- 75, ఓబీసీ- 270, ఈడబ్ల్యూఎస్- 100.
వయస్సు : మే 31 2023 నాటికి 32 ఏండ్లు మించకుడదు (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది).
జీతం : నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్. వంద మార్కులకు ఉంటుంది. బ్యాంకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, , జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ సినారియోలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.175; దివ్యాంగులకు రూ.175).
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15
ఆన్లైన్ పరీక్ష తేదీ : 2023 ఆగస్టు రెండు లేదా మూడో వారంలో ఉంటుంది.
వెబ్సైట్ : www.centralbankofindia.co.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

