ఆర్సీఎఫ్ఎల్లో ట్రేడ్ అప్రెంటిస్‌లు
ఆర్సీఎఫ్ఎల్| ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని సూచించింది.

ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2021-22 అకడమిక్ ఇయర్కుగాను 104 అప్రెంటిస్షిప్లను అందిస్తున్నది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్స్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శిక్షణ కాలం ఏడాదిపాటు ఉంటుంది.
మొత్తం అప్రెంటిస్‌లు: 104
ఇందులో హెచ్ఆర్ (రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్) ట్రైనీ 10, ఏఓసీపీ ట్రైనీ 60, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 10, మెడికల్ ల్యాబ్ (పాథాలజీ) ట్రైనీ 5, డిప్లొమా 19 (కెమికల్ 4, కంప్యూటర్ 5, ఎలక్ట్రికల్ 5, మెకానికల్ 5) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: హెచ్ఆర్ ట్రైనీ ట్రేడ్‌కు డిగ్రీ ఉత్తీర్ణులై ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం ఉండాలి. ఏఓసీపీ ట్రేడ్‌కు బీఎస్సీ కెమిస్ట్రీ, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌కు బీకామ్, బీబీఏ, ఎకనమిక్స్‌లో డిగ్రీ, ల్యాబ్‌టెక్నీషియన్‌కు హెచ్ఎస్సీ, డిప్లొమా ట్రేడ్లకు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా చేయాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
శిక్షణా కాలం: 12 నెలలు
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తులో పేర్కొన్న అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 31
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
వెబ్సైట్: https://www.rcfltd.com/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

