గ్రీన్ ఎనర్జీ : ఆవు పేడతో నడిచే తొలి ట్రాక్టర్ ఆవిష్కరణ
గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఓ బ్రిటన్ కంపెనీ ఆవు పేడతో నడిచే 270 హార్స్పవర్ కలిగిన టీ7 లిక్విడ్ మీథేన్ ఇంధన ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది.
లండన్ : గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఓ బ్రిటన్ కంపెనీ ఆవు పేడతో నడిచే 270 హార్స్పవర్ కలిగిన టీ7 లిక్విడ్ మీథేన్ ఇంధన ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. సాధారణ డీజిల్ ఇంజన్లకు దీటుగా ఈ ట్రాక్టర్ పెర్ఫామెన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఇదే తొలి టీ7 లిక్విడ్ మీథేన్ ఫ్యూయల్డ్ ట్రాక్టర్ అని, ఇది వ్యవసాయ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని మీథేన్ ఎనర్జీ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ బెనమన్ సహవ్యవస్ధాపకులు క్రిస్ మాన్ పేర్కొన్నారు.
కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ మెరుగైన సామర్ధ్యంతో కూడిన ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఈ ఆవిష్కరణ చేపట్టామని చెప్పారు. కాన్వాల్ కౌంటీలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్రాక్టర్ ట్రయల్ రన్ నిర్వహించగా కార్బన్డయాక్సైడ్ వాయువులు ఏడాదిలో 2500 మెట్రిక్ టన్నుల నుంచి 500 మెట్రిక్ టన్నులకు తగ్గాయని వెల్లడైంది. డీజిల్ తరహాలోనే అదే స్ధాయిలో ట్రాక్టర్ క్రయోజనిక్ ట్యాంక్ పవర్‌ను అందించగా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించింది.
కంపెనీ గత మోడల్ టీ6 మిథేన్ పవర్ సీఎన్జీ ట్రాక్టర్‌తో పోలిస్తే ఈ ట్రాక్టర్ ఇంధన సామర్ధ్యం నాలుగు రెట్లు అధికమని బెన్మన్ తెలిపింది. టీ7 మీథేన్ పవర్ ఎల్ఎన్జీ ట్రాక్టర్ నాన్ వెంటింగ్ క్రయోజనిక్ స్టోరేజ్ ట్యాంక్ మీథేన్ లిక్విడ్‌ను మెయింటైన్ చేస్తూ క్లీన్ పవర్‌ను నూతన వనరుగా సేద్య రంగం ముందుకు తీసుకువచ్చింది. డీజిల్ ట్రాక్టర్ల తరహాలోనే ఎల్ఎన్జీని భద్రంగా స్టోర్ చేసేందుకు అనువైన స్పేస్‌తో స్టెయిన్లెస్ స్టీల్ క్రయోజనిక్ ట్యాంక్‌ను ట్రాక్టర్లోపల ఏర్పాటు చేశామని కంపెనీ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

