కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్‌లను వెనక్కి నెట్టి!
Virat kohli | టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను అలవోకగా బ్రేక్ చేస్తున్నాడు.

పుణె: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను అలవోకగా బ్రేక్ చేస్తున్నాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత సొంత గడ్డపై అత్యంత వేగంగా 10 వేల పరుగులు(అన్ని ఫార్మాట్లలో కలిపి) పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అర్ధశతకం పూర్తి చేయడం ద్వారా కోహ్లీ ఈ మైలురాయి చేరుకున్నాడు. భారత కెప్టెన్ విరాట్ 195 ఇన్నింగ్స్‌ల్లో 61.74 సగటుతో స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్లో 10002 పరుగులు సాధించాడు.
ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సొంతగడ్డపై 10వేల రన్స్ పూర్తి చేయడానికి 219 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 223 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. మాజీ ఆటగాళ్లు మహేల జయవర్దనే(224 ఇన్నింగ్స్‌లు), కుమార సంగక్కర(229), జాక్వెస్ కలీస్(236) తమ సొంతగడ్డపై 10వేల పరుగుల మార్క్ అధిగమించినప్పటికీ కోహ్లీ మాదిరిగా ఒక్కరు కూడా 200 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

