‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రంతో విమర్శకులు ప్రశంసలందుకున్నారు దర్శకుడు వెంకటేష్ మహా. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అట్టహాసం’. చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మాతలు. ఈ సినిమాలో వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
మంగళవారం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రెండు జంటల కథ ఇదని పోస్టర్స్‌ని బట్టి అర్థమవుతున్నది. సహజత్వానికి దగ్గరగా ఉండే కథాంశమిదని, వినోదప్రధానంగా మెప్పిస్తుందని, త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి స్మరణ్‌సాయి సంగీతాన్నందిస్తున్నారు.