23న ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు

హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నది. రోజుకు 12 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కాగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచన మేరకు బోర్డు సభ్యత్వానికి ప్రశాంతిరెడ్డి రాజీనామా చేశారు. కొవిడ్ నేపథ్యంలో గత ఏడాది మార్చి 20 నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశామని టీటీడీ తెలిపింది. వీరికి ప్రత్యేక దర్శనాల రద్దు కొనసాగుతున్నదని టీటీడీ స్పష్టంచేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- online tickets
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

