Zero Shadow Day | నీడ పోతుంది.. రేపు హైదరాబాద్‌లో జీరో షాడో డే
ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్కృతం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది.
- నడినెత్తిన నిట్టనిలువుగా సూర్యకిరణాలు
- మాయం కానున్న నీడ
- ఏడాదికి రెండు సార్లు ఈ అద్భుతం
- ఈ నెల 9న మధ్యాహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య అరుదైన సంఘటన
- ఆగస్టు 3న కూడా జీరో షాడో ఉందన్న బిర్లా సైంటిస్టులు
Zero Shadow Day | సిటీబ్యూరో, మే 7 ( నమస్తే తెలంగాణ) : ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్కృతం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. ఆ రోజున సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జీరో షాడో డేగా పిలుస్తారని తెలిపారు. ఎండలో నిటారుగా (90డిగ్రీల) ఉంచిన వస్తువుల నీడ రెండు నిమిషాల పాటు అంటే 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి అరుదైన సంఘటనను నగరవాసులు తప్పకుండా అనుభూతి చెందాలని సూచించారు. సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. కానీ అదే సూర్య కాంతిలో నీడ ఉండదనే అద్భుతం వెనక అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. కాగా, ఇటీవల నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రోజు వాతావరణ పరిస్థితుల్లో తేడాలు ఏర్పడితే సూర్యుడు కనిపించకపోవడం వల్ల ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
ఎందుకు ఇలా..
భూమి ప్రతిరోజు తనచుట్టూ తాను తిరుగుతుంది. ఈ ఆత్మ భ్రమణానికి 24 గంటల సమయం పడుతుంది. అలా తిరగడం వల్ల సూర్యుడు తూర్పు నుంచి ఉదయించి పడమరలో అస్తమించినట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో మధ్యాహ్నం వేళ సూర్యుడు మన తలమీదుగా వెళుతూ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా 90 డిగ్రీల కోణంలో భూమి మీద పడినప్పుడు ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు నీడ కనిపించదు. కారణం ఆ నీడ ఆ వస్తువు మీదనే పడుతుంది. దీనిని శూన్యపు నీడ క్షణం లేదా జీరో షాడో మూవ్మెంట్ అని పిలుస్తారని ప్రొఫెసర్ శాంతి ప్రియ పేర్కొన్నారు.
ప్రతిరోజు జీరో షాడో చూడలేమా?
ప్రతిరోజు సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అలా అని ప్రతిరోజు జీరో షాడో ఉండదని స్పేస్టైం గైడ్ ప్రవీణ్ అన్నారు. సూర్యుడు ప్రతి రోజు మిట్ట మధ్యాహ్నం మన తలపై మీదుగా వెళ్లడు. అలా వెళితే జీరో షాడో మూవ్మెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. భూమి గోళాకారంలో ఉండటం వల్ల సూర్యకిరణాలు మధ్యాహ్నం పూట భూ మధ్య రేఖపై మాత్రమే పడుతాయి. దానికి ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవని చెప్పారు. భూమి కొన్ని సార్లు ఉత్తరముఖంగా, మరికొన్ని సార్లు దక్షిణముఖంగా ప్రయాణిస్తుంది.
భూమిపై ఉన్న మనకు సూర్యుని గమనం ఉత్తరయాణంలో 6 నెలలు ఉత్తరదిశగా..దక్షిణాయానంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ఈ సమయంలో భూమి వంపు సుమారు 23.5 డిగ్రీలు ఉంటుందని తెలిపారు. దీనివల్ల భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తల మీదు నుంచి వెళ్తాడని వివరించారు. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అని పిలుస్తారని చెప్పారు. ఏడాదికి రెండుసార్లు జీరో షాడో మూవ్మెంట్ జరుగుతుంది. అంటే ఉత్తరయాణంలో ఒక్కసారి, దక్షిణయానంలో మరొక్కసారి ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

