చిలీ రాజధాని శాంటియాగోలో అద్భుతం జరిగింది. రాత్రిపూట ఆకాశంలో ఉల్కాపాతం మెరిసింది. ఆకాశం నుంచి ఉల్కాపాతం మెరుస్తూ భూమివైపునకు దూసుకొచ్చింది. ఈ అద్భుత ఖగోళ దృశ్యం కెమెరాకు చిక్కింది. ఉల్క సౌరమండలంలో ఓ శిథిల పదార్థమని, ఉల్కాపాతంలో చిన్నముక్క మండి భూమిపైకి దూసుకొచ్చినట్లు కన్సెప్సియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ధ్రువీకరించారు.
శాంటియాగోలోని వివిధ ప్రదేశాల నుంచి ఉల్కాపాతం కనిపించింది. దాని కదలికలు కెమెరాకు చిక్కాయి. అండీస్ ప్రాంతంలో అదృశ్యమయ్యే ముందు ఉల్కాపాతం అనేక భాగాలుగా విడిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, ఈ ఉల్కను ‘టీ12సీఎల్’గా పిలుస్తారని చిలీ ఆస్ట్రానమీ ఫౌండేషన్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ బీమిన్ వెల్లడించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వేలాది వ్యూస్‌తో వైరల్ అవుతోంది. ఉల్కాపాతం ఆకాశాన్ని దాటి నగరాన్ని భారీ ఫ్లాష్‌లైట్‌గా వెలిగించడం చూసి నెటిజన్లు మైమరిచిపోయారు.