కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అల్లోల
నిర్మల్, ఫిబ్రవరి 23 : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుదని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని సారంగాపూర్ మండలంలో రూ. 12.05 కోట్ల వ్యయంతో చేపట్టిన ధోనిగాం ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయకట్టు చిట్టచివరి ఎకరానికి సాగు నీరందివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జలాశయాల నిర్మాణం, ఆధునీకరణ పనులకు పెద్దపీట వేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.
ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణకు నిధులు మంజూరు కావడంతో ఈ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలు తీరనున్నాయని చెప్పారు. నిధులు మంజూరు కావడంతో టెండర్లు పూర్తి చేసి ఇవాళ పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

