మాస్కో: రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా తల్లి కాబోతున్నది. బేబీకి జన్మనివ్వబోతున్న వార్తను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌కు చెందిన ఫోటోను కూడా అప్లోడ్ చేసింది. ఇద్దరికి కావాల్సిన కేక్‌ను తింటున్నట్లు ఆమె ఆ ఫోటోకు ట్యాగ్‌లైన్ ఇచ్చింది. ఇన్‌స్టాలో షరపోవాకు 42 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మంగళవారం మారియా షరపోవా 35వ బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఈ పోస్టును పెట్టింది. టెన్నిస్‌లో అయిదు గ్రాండ్ స్లామ్ టోర్నీలు గెలిచిన షరపోవా.. బ్రిటీష్ మిలియనీర్ అలెగ్జాండర్ గిల్క్స్‌తో ఎంగేజ్ అయ్యింది.
2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ నెగ్గిన షరపోవా పెను సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల ఈ ఏడాది వింబుల్డన్‌లో రష్యా ఆటగాళ్లపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెద్వెదేవ్ లాంటి స్టార్ ప్లేయర్లు వింబుల్డన్‌లో ఆడే అవకాశం కోల్పోనున్నారు.