Shardul Thakur | కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తర్వాత ఇప్పుడు మరో టీమిండియా క్రికెటర్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. తన ప్రేయసి మిట్టాలీ పరూల్కర్తో శార్దూల్ ఠాకూర్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 27న వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మోడల్ మిట్టాలీ పరూల్కర్తో శార్దూల్ ఠాకూర్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. వీళ్లిద్దరికీ ఏడాదిన్నర క్రితమే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 27న ముహూర్తం కుదిరింది. ముందుగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామని శార్దూల్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో ముంబై సమీపంలోనే శార్దూల్, మిథాలీ పెళ్లి జరగబోతోంది. ఈ వేడుకకు 200 నుంచి 250 మంది వరకు అతిథులు హాజరు కానున్నారు.
శార్దూల్, మిథాలీ పెళ్లి వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శార్దూల్, మిథాలీతో పాటు ఇరు కుటుంబసభ్యులు అదరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.