Steve Smith | ఇండియాపై టెస్టు సిరీస్ గెలవడం యాషెస్ కంటే విలువైనది : స్టీవ్ స్మిత్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం తమకు యాషెస్ గెలవడం కంటే ఎక్కువ అని స్మిత్ అన్నాడు.
Steve Smith : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం తమకు యాషెస్ గెలవడం కంటే ఎక్కువ అని స్మిత్ అన్నాడు. భారత పర్యటన గురించి ఆసీస్ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకున్న వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో.. భారత గడ్డపై సిరీస్‌లో ఒక్క టెస్టు గెలవడం కూడా కష్టమే. అలాంటిది మేము సిరీస్ నెగ్గితే అది పెద్ద విజయం. భారత్‌లో సిరీస్ గెలవడం అనేది యాషెస్ కంటే విలువైనది అని స్మిత్ తెలిపాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో సెంచరీలు
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ నాలుగు టెస్టులు ఆడనున్నాయి. తొలి టెస్టుకు నాగ్‌పూర్ వేదిక. ఫిబ్రవరి 9న తొలి సమరం మొదలుకానుంది. ఈమధ్యే బిగ్‌బాష్ లీగ్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన స్మిత్ ఈ సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో ఆసీస్ భారత స్పిన్నర్ అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు బరోడా స్పిన్నర్ మహేశ్ పిథియాను తీసుకుంది. అతని బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ప్రాక్టీస్ చేస్తూ వీడియోలో కనిపించాడు. స్వదేశంలో బాక్సింగ్ డే టెస్టులో దుమ్మురేపిన వార్నర్ కూడా ఇండియాపై పరుగుల వదర పారించేందుకు ఎదురుచూస్తున్నాడు. దాంతో, ఇరుజట్ల మధ్య ఈ సీరస్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉండనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

