South Africa | శ్రీలంకతో సిరీస్ గెలిచి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి దక్షిణాఫ్రికా
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. 348 పరుగుల భారీ ఛేదనలో భాగంగా ఆట చివరిరోజు ఓవర్ నైట్ స్కోరు 205/5తో బ్యాటింగ్‌కు వచ్చిన లంకేయులు.. మరో 33 పరుగులు మాత్రమే జోడించి 238కు ఆలౌట్ అయ్యారు.
South Africa | గబేహా: స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. 348 పరుగుల భారీ ఛేదనలో భాగంగా ఆట చివరిరోజు ఓవర్ నైట్ స్కోరు 205/5తో బ్యాటింగ్‌కు వచ్చిన లంకేయులు.. మరో 33 పరుగులు మాత్రమే జోడించి 238కు ఆలౌట్ అయ్యారు. సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (5/76) లంక పనిపట్టాడు. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (50) కుశాల్ మెండిస్ (46) ఔట్ అవడంతో సఫారీల విజయం ఖాయమైంది. డేన్ పీటర్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సౌతాఫ్రికా సారథి టెంబ బవుమాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
ఇక ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. 63.33 శాతంతో దక్షిణాఫ్రికా తొలి స్థానాన్ని దక్కించుకోగా 60.71తో ఆస్ట్రేలియా రెండో స్థానాన నిలిచింది. 57.29 శాతంతో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈనెలాఖరున పాకిస్థాన్‌తో సొంతగడ్డపై జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక్కటి గెలిచినా సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటారు. భారత్ విషయానికొస్తే.. ఆసీస్‌తో ఆడబోయే మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిస్తేనే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా మూడోసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశముంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

