ఆల్ ఇంగ్లండ్ టోర్నీ.. సింధు స్టన్నింగ్ విక్టరీ

బర్మింగ్‌హామ్: పీవీ సింధు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌లో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. జపాన్ ప్లేయర్ యమగుచితో జరిగిన మ్యాచ్‌లో.. అద్భుత రీతిలో పీవీ సింధు తన ఆటను ప్రదర్శించింది. తొలి గేమ్‌ను కోల్పోయిన హైదరాబాదీ.. ఆ తర్వాత రెండు వరుస గేమ్‌లను తన ఖాతాలో వేసుకుని అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్నది. రసవత్తరంగా సాగిన క్వార్టర్స్‌లో 16-21, 21-16, 21-19 స్కోర్‌తో పీవీ సింధు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నది. అయిదోవ ర్యాంక్‌లో ఉన్న యమగుచి తొలి గేమ్‌ను ఈజీగానే గెలుచుకున్నది. కానీ ఆ తర్వాత కోలుకున్న ఏడో ర్యాంక్ ప్లేయర్ సింధు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నది. తొలి గేమ్‌లో తప్పులు చేసినా.. అనూహ్య రీతిలో సింధు కోలుకున్నది.
యమగుచితో ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో సింధు ఓటమిపాలైంది. ఈ సారి సింధుపై యమగుచి నాలుగో విజయం సాధించడం ఖాయమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తొలి గేమ్‌ను యమగుచి గెలవడంతో ఆ డౌట్స్ మరింత బలపడ్డాయి. కానీ హైదరాబాదీ సింధు మాత్రం తన పూర్తి సత్తాను ప్రదర్శించింది. మూడవ నిర్ణయాత్మక గేమ్‌లో.. ఇద్దరూ భారీ ర్యాలీలతో హోరెత్తించారు. డిసైడర్ గేమ్‌లో సింధు కీలక దశలో అసామాన్య ఆటను కనబరిచింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఆ గేమ్‌ను 21-19తో గెలుచుకున్నది. మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉందని సింధు పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

