హైదరాబాద్, ఆగస్టు 20: ఇది ఆషామాషీ అభివృద్ధి కాదు.. ఏదో మాటలతో సాధించిన ఘనతా కాదు.. ప్రపంచ నగరాలను తలదన్నేలా సాధించిన ఆర్థిక వృద్ధి.. మన హైదరాబాద్ సొంతమైంది. ప్రపంచంలోనే అత్యంత జీడీపీ వృద్ధి సాధించిన నగరాల్లో దేశంలోనే టాప్-1గా నిలిచింది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ ప్రొజెక్షన్ నివేదిక-2022 ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
తొలి స్థానంలో వియత్నాంలోని ‘హో చి మిన్’ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానానికి మన రాజధాని నగరం దూసుకొచ్చింది. టాప్ 10 నగరాల్లో భారత్ నుంచి హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వరుసగా ఉన్నాయి. కాగా, 2021లో టాప్-15లో హైదరాబాద్ 11వ స్థానంలో ఉన్నది. ఏడాదిలోనే రెండో స్థానానికి ఎగబాకింది.