నేటి సోషల్‌మీడియా యుగంలో ప్రశంసలతో పాటు ట్రోలింగ్స్ కూడా సహజమే. ముఖ్యంగా సెలబ్రిటీలు మాట్లాడే ప్రతీ మాటకు అర్థాన్ని వెతకడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సాంఘిక మాధ్యమాల్లో వచ్చే ట్రోలింగ్స్, నెగెటివ్ ప్రచారంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను అందరితో సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటానని, ఎవరి కోసమో తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని స్పష్టం చేసింది. ‘ప్రతీ ఒక్కరితో సఖ్యతగా ఉండాలన్నది నా ఫిలాసఫీ.
మంచితనం బలహీనత కాదు. అందరికి నేను నచ్చాల్సిన అవసరం లేదు. నేను ఉన్న చోట పాజిటివ్ వైబ్స్ ఉండాలని కోరుకుంటా. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటాను. దాని వల్ల నా కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషంగా ఉంటారు’ అని రష్మిక మందన్న పేర్కొన్నది. తాజా చిత్రం ‘రణబాలి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న పై వ్యాఖ్యలు చేసింది. వివాహానంతరం విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న కలిసి నటించిన ‘రణబాలి’ ఈ నెల 16న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది.