ముంబై: రాహుల్ తివాటియా ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 190 టార్గెట్‌తో బరిలోకి దిగిన టైటాన్స్ జట్టుకు చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ తివాటియా అనూహ్య రీతిలో తన సత్తా చాటాడు. రెండు భారీ సిక్సర్లతో పవర్ గేమ్‌ను ప్రజెంట్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదైంది. తివాటియా 3 బంతుల్లో 13 రన్స్ కొట్టాడు. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న సమయంలో.. తివాటియా జూలు విదల్చడంతో పంజాబ్‌కు షాక్ మిగిలింది. ఆయితే ఆ రెండు భారీ సిక్సర్లకు సంబంధించిన వీడియో ఇదే.
Lord #Tewatia
#GTvsPBKS pic.twitter.com/qZbIjCY3pB
— तमराज॰॰॰ (@Tw_Manish) April 8, 2022