First Hydrogen Train | తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
First Hydrogen Train | దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ప్రధాని మోదీ శుక్రవారం హర్యానాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యాలోని జింద్, సోనిపట్ మధ్య (89 కి.మీ) నడవనుంది.
First Hydrogen Train | దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ప్రధాని మోదీ శుక్రవారం హర్యానాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యాలోని జింద్, సోనిపట్ మధ్య (89 కి.మీ) నడవనుంది. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి రైల్వే వ్యవస్థలో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయడం దేశ గర్వకారణమని వెల్లడించారు. అధునాతన రైల్వే ఇంజినీరింగ్‌లో దేశ సామర్థ్యాలకు ఇది నిదర్శమని కొనియాడారు.
ఇదిబొగ్గు, డీజిల్ అవసరం లేకుండా కేవలం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. ఇది రైలును ముందుకు నడపటానికి హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. దీనివల్ల రైలు నడుస్తున్నప్పుడు కార్బన్ ఉద్గారాలు సున్నా (Zero Carbons)గా ఉంటాయి.
పర్యావరణహితంగా ‘నమో గ్రీన్రైలు’ పేరుతో నడిచే ఈ రైలుకు 10 కోచ్‌లు, 3200 హెచ్‌పీ (HP) ఇంజిన్ ఉన్నాయి. ఈ రైలు సుమారు గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో దాదాపు 2600 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నిర్మించింది. దీంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలో అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది.
ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు జర్మనీలో నడిపారు. ఆ తరువాత జపాన్, చైనా, యూఎస్‌లలో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

