మద్యం మత్తులో పోలీసుల కారు బీభత్సం.. ట్రాలీని ఢీకొట్టి బాధితులకు బెదిరింపులు!
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు, హోంగార్డు మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని ఢీకొట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
కాసిపేట, నవంబర్ 14: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు, హోంగార్డు మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని ఢీకొట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కారు బలంగా ఢీకొనడంతో ట్రాలీతో పాటు వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కారు ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో ట్రాలీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న పోలీస్ సిబ్బందిని నిలదీశారు. ట్రాలీకి మరమ్మతులు చేయిస్తామని తొలుత హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత నష్టపరిహారం చెల్లించబోమని ట్రాలీ యజమాని చింతల సాగర్‌ను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు శుక్రవారం రాత్రి కాసిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారులో దేవాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు, హోంగార్డు ఉన్నారని బాధితులు పేర్కొంటున్నారు. తొలుత పరిహారం చెల్లిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన వారు, మరుసటి రోజు మాట మార్చారని ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.
అంతేకాకుండా పోలీసు సిబ్బంది కావడంతో ప్రమాద సమయంలో కారు నడిపిన అసలు వ్యక్తిని పక్కనపెట్టి, మరొకరిని డ్రైవర్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాసిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందిపైనే మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే వేగంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులను ఢీకొట్టి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని బాధితుడు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం మత్తులో పోలీసుల కారు బీభత్సం.. ట్రాలీని ఢీకొట్టి బాధితులకు బెదిరింపులు!
Ramayana | తమిళనాడులోనూ ‘రామాయణ’ ప్రభంజనం.. సూర్య ‘సీన్’ను మించిన రణ్‌బీర్ సినిమా!
Mission Bhageeratha | కరువు కాలంలో ప్రమోషన్ల వివాదం.. మిషన్ భగీరథలో సీనియర్ల ఇంజినీర్లు గరంగరం!
RTC Season Pass | ఆర్టీసీ సీజన్ పాస్‌పై సండే ఫ్రీ.. 9 అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలు
Inter Board | ఇంటర్ విలీనంపై తప్పుడు లెక్కలు… విలీనానికి చెప్తున్న కారణాల్లో డొల్లతనం
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

