న్యూఢిల్లీ : బాణాసంచా వెలుగు జిలుగులను ఓ పైలట్ కాక్‌పిట్ నుంచి రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో (Viral Video) నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వైరల్ క్లిప్‌ను రెడిట్‌లో షేర్ చేయగా పలువురు నెటిజన్లను ఇది ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో విమాన పైలట్ కనిపించగా అతడి చుట్టూ బాణాసంచా వెలుగు జిలుగులను చూడొచ్చు. అతడు ఆ ప్రాంతాన్ని దాటేవరకూ ఫైర్వర్క్స్ షోను రికార్డుచేశాడు. కాక్‌పిట్ నుంచి ఫైర్వర్క్స్ షో వ్యూ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Fireworks show view from the cockpit
by u/WarriorMonk_420 in interestingasfuck
ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకోగా, రెడిట్‌లో తానింతవరకూ చూసిన వాటిలో ఇదే అత్యుత్తమమైనదని ఓ యూజర కామెంట్ చేయగా, పైలట్ సరైన పని చేశాడని కూల్ జాబ్ అంటూ మరో యూజర్ ప్రశంసలు గుప్పించారు.