షబ్-ఎ-బరాత్.. మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు నిలిపివేత

హైదరాబాద్ : షబ్-ఎ-బరాత్‌ను పురస్కరించుకుని ఆదివారం సాధారణ ప్రజానీకం మక్కా మసీదులోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మక్కా మసీదు సూపరింటెండెంట్ అబ్దుల్ ఖాదీర్ మాట్లాడుతూ.. మతపరమైన వేడుకల్లో సామూహిక సమావేశాలు లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులను ప్రార్థనల నిమిత్తం మసీదులోకి అనుమతించటం లేదన్నారు. కేవలం మసీదు సిబ్బంది మాత్రమే ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. నగరంలోని ఇతర ప్రదేశాల్లో నిర్వహించ తలపెట్టిన సామూహిక ప్రార్థనలను సైతం నిలిపివేసినట్లు చెప్పారు. ప్రజలు ఇంట్లోనే ఉంటూ ప్రార్థనల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

