ఆన్లైన్ అప్పు ముప్పే!
ఇటీవల, ఒక ఆన్లైన్ ఫైనాన్స్ యాప్ నుంచి రూ.25 వేలు వ్యక్తిగత రుణం తీసుకున్నాను. పన్నెండు వాయిదాల్లో తీర్చాలి. ఆరు వాయిదాలు సక్రమంగా చెల్లించిన తర్వాత, రుణ పరిమితి పెంచారు. మరో రూ. 25 వేలు అప్పు తీసుకున్నాను. రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మళ్లీ ‘మీరు రూ.10 వేల రుణానికి అర్హులు’ అని మెసేజ్ వచ్చింది. ఆ మొత్తమూ తీసుకున్నాను. ఇప్పుడు, మూడు రుణాల వాయిదాలు చెల్లించడం కష్టంగా మారింది. అప్పు ఇచ్చే సమయంలో సిబిల్ స్కోర్
ఆధారంగా క్షణాల్లో డబ్బు ఖాతాలో వేస్తున్నారు. కానీ, వడ్డీ భారీగా వసూలు చేస్తున్నారేమో అని భయంగా ఉంది. రుణ యాప్‌లకు దూరంగా ఉండటం ఎలా?
శ్రీప్రియ, హైదరాబాద్
రుణం తీసుకోవడం తప్పు కాదు. ఎందుకు తీసుకుంటున్నారన్నది ముఖ్యం. అత్యవసర సమయాల్లో పరిమిత మొత్తంలో తీసుకోవచ్చు. కాకపోతే సరదాల కోసమో, గ్యాడ్జెట్స్ కొనడానికో, మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చిందనో, ఆఫర్లు ఉన్నాయనో.. తాత్కాలిక అవసరాలకు రుణాలు తీసుకోవడం వల్ల ముప్పు తప్పదు. చాలా రుణ యాప్‌లు వడ్డీ 15 శాతమనే పేర్కొంటాయి. అయితే, ఇవి చక్రవడ్డీ వసూలు చేస్తాయి. ఈ లెక్కలు అందరికీ అర్థం కావు. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చక్రవడ్డీని ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడంటేనే.. ఆ లెక్కలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ యాప్‌లో రుణం తీసుకునే ముందు వడ్డీ మీద వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడున్న వాయిదాలు నెలలవారీగా చెల్లించి, ఇకనుంచి వాటికి వీలైనంత దూరంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రాబడిని దృష్టిలో ఉంచుకొని, ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే.. ఇలా అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు.
దీప నిట్టల చార్టర్డ్ వెల్త్ మేనేజర్
డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

