వెల్లింగ్టన్, నవంబర్ 28: చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు జూలీ ఆన్ గ్రెంటెర్. న్యూజిలాండ్ ఎంపీ. నిండు గర్భిణి. కాన్పు కోసం దవాఖానకు సైకిల్‌పై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. గత ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో అమెకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే జూలీ సైకిల్‌పై దవాఖానకు బయల్దేరారు. స్వయంగా సైకిల్ తొక్కుతూ 10 నిమిషాల్లో అక్కడికి చేరుకొన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చారు. జూలీ తన కాన్పు కోసం సైకిల్‌పై వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. మూడేండ్ల క్రితం కూడా ఇలాగే దవాఖానకు సైకిల్‌పై వెళ్లారు. అప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చారు. అది ఆమెకు మొదటి కాన్పు కావడం విశేషం.