ప్రపంచ కుబేరుల్లో రెండోస్థానం కోల్పోయిన మస్క్

వాషింగ్టన్: ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (49) బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. లూయీ వ్యూటన్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ (72) ఆ స్థానంలోకి ఎగబాకారు. మస్క్ షేర్ల ధర 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణం. గతవారం టెక్నాలజీ షేర్లు పడిపోవడం వల్ల మస్క్ ఆస్తుల విలువ గత జనవరి నాటికంటే 24 శాతం తగ్గి 160.6 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. భారత కరెన్సీలో ఇది 12 లక్షల కోట్ల పైచిలుకే. గత మార్చిలో కొద్దిరోజుల పాటు మస్క్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు కూడా. కాగా చైనాలో, ఆసియాలోని ఇతర భాగాల్లో లగ్జరీ గూడ్స్ దిగ్గజం లూయీ వ్యూటన్ అమ్మకాలు భారీగా పెరుగడంతో ఆ సంస్థ అధిపతి ఆర్నాల్ట్ నికర ఆస్తి విలువ 4700 కోట్ల డాలర్లు పెరిగి 161.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మస్క్ సంపదన కన్నా ఇది కొంచెమే ఎక్కువ. దాంతో ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల్లో నంబర్-టూ స్థానాన్ని దక్కించుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

